Header Ads

Gandikota importent Details News in Telugu 2018

కోటలు:
గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం).
విహారప్రాంతాలు:
గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం.
గండికోట దగ్గర పెన్నా లోయ
పుణ్యక్షేత్రాలు:
అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: ఆం.ప్ర.లోని ఏకైక శంకరాచార్య మఠం, శిల్పకళా వైభవంలో రెండవ హంపి అని పేరు).
వైష్ణవ: దేవుని కడప (విశేషం:మహాభారతంలోని జనమేజయుని కాలంలో కృపాచార్యుడు ప్రతిష్ఠించిన ప్రసన్న వేంకటేశ్వర విగ్రహం), ఒంటిమిట్ట (కోదండరామాలయం), గండి (విశేషం: శ్రీరాముడు తన బాణపు మొనతో కొండరాతి మీద గీసిన వీరాంజనేయ రూపం. ఇక్కడ కొండకు గండి కొట్టింది పాపాఘ్నీ నది), తాళ్ళపాక (అన్నమాచార్యుని జన్మస్థలి), నందలూరు (సౌమ్యనాథాలయం), జమ్మలమడుగు (నారాపుర వేంకటేశ్వర ఆలయం), పులివెందుల (రంగనాథ ఆలయం), గండికోట (చెన్నకేశవాలయం), లక్ష్మీపాలెం (ప్రసన్నవేంకటేశ్వరాలయం), వెల్లాల (సంజీవరాయ ఆలయం),  పెండ్లిమర్రి (వేయినూతుల కోన లేదా వెయ్యినూతుల కోన), పెద్దముడియం (భీమగుండం, విశేషం: భీముడు తన గదతో ఏకశిలను నూటొక్క ముక్కులుగా చేసి భూమి నుండి నీరు పైకి తెప్పించిన ప్రదేశం), సిద్ధవటం (రంగనాధ ఆలయం)
శైవ: పొలతల, నిత్యపూజకోన, అత్తిరాల (విశేషం: మొదట్లో బ్రహ్మకు ఐదు తలలుండేవి. వాటిలో ఒక తల శివుణ్ణి విపరీతంగా దూషిస్తూంటే శివుడు ఆ తలను చిటికెనవేలి గోటితో నరికాడు. ఆ “హత్య” వల్ల తల “రాలి”న చోటుహత్య-రాలె అత్తిరాలగా మారింది), ప్రొద్దుటూరు (శివాలయం/అగస్త్యేశ్వరాలయం, రామేశ్వరం, కన్యకాపరమేశ్వరి ఆలయం), మోపూరు (భైరవేశ్వరాలయం), రాయచోటి (విశేషం: దేశంలోని ప్రముఖ వీరభద్రాలయాల్లో ఒకటి), అల్లాడుపల్లె (వీరభద్రాలయం), కడప (విజయదుర్గాలయం), నల్లమల (భైరేని ఆలయం), జ్యోతి (సిద్ధవటం మండలం), జమ్మలమడుగు (కన్యతీర్థం, అగస్త్యేశ్వరకోన), వేంపల్లె (వృషభాచలం/ఎద్దుల కొండ), అనిమెల (సంగమేశ్వరాలయం), చదిపిరాల్ల (విశేషం: శివుడు లింగాకారంలో కాక విగ్రహరూపంలో ఉన్న ఆలయం), దేవగుడి (తలకంటమ్మ గుడి) ఖాజీపేట సమీపంలోని నాగనాథేశ్వరకోన లేదా నాగేశుకొండ (ఇక్కడ ఒక గుహలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాలు బయట పడినాయి), ముక్కొండ (శివాలయం), ఓబిలి (పద్మగిరినాధాలయం, సంగమేశ్వరాలయం)
బౌద్ధ/జైన: నందలూరు/ఆడపూరు బౌద్ధారామాలు, దానవులపాడు (జైనక్షేత్రం).
ఇతరాలు: బ్రహ్మంగారిమఠం, సిద్ధయ్య మఠం, కాశినాయన జ్యోతి క్షేత్రం, నీలకంఠరావుపేట దర్గా, రాయచోటి పత్తర్ మసీదు, రాజంపేట మసీదు, జుమ్మా మసీదు (గండికోట), కడపలోని అమీన్ పీర్ దర్గా, షామీరియాదర్గా, ఆరోగ్యమాత చర్చి, కేథడ్రాల్/మేరీమాతచర్చి (ఇటలీ నుండి తీసుకువచ్చిన మేరీమాత విగ్రహం), కరుణగిరి, కలసపాడు చర్చి, పుట్లంపల్లె రామకృష్ణ మఠం, ఎల్లాయపల్లె చిన్మయారణ్యం (ఓబులవారిపల్లె మండలం), చిన్మయా మిషన్ ఆలయాలు (కడప), మోటకట్ల (సంబేపల్లి మండలం), నారాయణస్వామి మఠం (బ్రహ్మంసాగర్ కింద ముంపుకు గురైంది).
ఉత్సవాలు / తిరునాళ్ళు :
దేవుని కడప తిరునాల (రథసప్తమి రోజు), పెద్దదర్గా ఉరుసు (ముహర్రం/కార్తీకమాసంలో ఎనిమిది రోజులపాటు), కమలాపురం ఉరుసు, జమ్మలమడుగు గూడు మస్తాన్ వలి ఉరుసు, మల్లూరమ్మ జాతర, దసరా (ప్రొద్దటూరు, కడప), వీరబల్లె జాతర, అనంతపురం గంగమ్మ తిరునాల (లక్కిరెడ్డిపల్లె మండలంలో శివరాత్రి తర్వాత రెండవరోజు, మూడవరోజు), గంగమ్మ తోపులో జరిగే గంగమ్మ తిరునాల (చింతకొమ్మదిన్నె మండలంలో శివరాత్రి తర్వాత మూడవరోజు, నాలుగవ రోజు). ఈ తిరునాళ్ళ తర్వాత కూడా ఏడాది పొడవునా ఆది, గురు, మంగళ, శుక్రవారాల్లో భక్తులు వస్తూనే ఉంటారు.
కొనుగోలు:
శెట్టిగుంట కొయ్యవస్తువులు, వనిపెంట ఇత్తడి సామాన్లు & కొయ్యవస్తువులు, ప్రొద్దటూరు బంగారు, మాధవరం, జమ్మలమడుగు చేనేతలు.
కడప రుచులు:
నన్నారీ షర్బత్ & లస్సీ, కారందోసెలు, రాగిసంగటి – వంకాయబజ్జి, అలసంద వడలు, ఉగ్గాని (బొరుగుల బువ్వ), ఓలిగలు (బచ్చాలు), పరమాన్నం, గువ్వలచెరువు పాలకోవా, వీరబల్లె బేనిషా మామిడిపండ్లు, పులివెందుల అరటి, కడప దోసపండ్లు (Kadapa melon), రైల్వేకోడూరు మామిడి, అరటి, బొప్పాయి, మాంసాహార ప్రియులకు రాగిసంగటి – నాటుకోడి పులుసు, చెన్నూరు కుండబిర్యాని. తాంబూలానికి చెన్నూరు తమలపాకులు.
ప్రభుత్వం పూనుకుంటే సాంస్కృతిక/విద్యా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం గల ప్రాంతాలు :
నల్లమల కొండల్లోని బెలుంగుహ, పెనుశిల అభయారణ్యం, బృహత్ శిలాయుగంనాటి సమాధులున్న దేవాండ్లపల్లె, ఆదిమానవులు గీసిన రేఖాచిత్రాలున్నచింతకుంట(విశేషం: మధ్యశిలాయుగంతో పాటు నవీనశిలాయుగపు చిత్రలేఖనాలు), మల్లుగాని బండ (http://www.kadapa.info/రేఖాచిత్రాలు/), పాలకొండలలోని దుర్గంకోట, తొలి తెలుగు శాసనాల ఎర్రగుడిపాడు-కలమల్ల, బౌద్ధక్షేత్రం కొండూరుతిప్ప (రాజంపేట పట్టణానికి సమీపంలో ఉన్న రాంనగర్‌ గుట్ట), బుద్ధుడి పాదముద్రలున్న పుల్లూరు, భక్తకన్నప్ప స్వగ్రామం ఊటుకూరు, లంకమల్లేశ్వర అభయారణ్యం (ప్రపంచలోనే అరుదైన కలివికోడికి ఆవాసం), కొండూరు కలివికోడి మ్యూజియం, కడపలోని భగవాన్ మహావీర్ మ్యూజియం, మైలవరంలోని మ్యూజియం, కడప నగరంలోని సిపి బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రం, రేనాటిచోళుల రాజధాని పెదచెప్పలి, వేమన పుట్టిన చిట్వేలి, మొల్ల పుట్టిన గోపవరం, పెద్దన పెరిగిన చౌడూరు, “సురభి” నాటక సమాజం పుట్టినూరు, గండికోట జలాశయం తదితరాలు.

No comments:

Plise coment this blog Activetes

Fyu

Powered by Blogger.